కరోనా వాక్సిన్ లపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ ఒక వాక్సిన్ తయారీ సంస్థ చేదువార్త వినిపించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక వాక్సిన్ తయారీదారు సంస్థతో ఒప్పందం కుదుర్చుకోగా వారు నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో దుష్ప్రభావాలు కనిపించడంతో ఆ వాక్సిన్ ను పూర్తిగా రద్దు చేసారు.
ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ యూనివర్సిటీ, సీఎస్ఎల్ ఔషధ సంస్థ సంయుక్తంగా కరోనా వాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్నాయి. కాగా ఇందుకు సంబందించిన ప్రాథమిక ప్రయోగాలు విజయవంతం కావడంతో ఇటీవల క్లినికల్ ట్రయల్స్ ను చేపట్టారు. మొదటి దశ ప్రయోగాల్లో యాంటీ బాడీలు ఉత్పత్తి అయ్యి సత్ఫాలితాలను ఇచ్చాయి.
అయితే రెండు, మూడు దశలో ఈ వాక్సిన్ వల్ల శరీరంలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నట్టుగా గుర్తించారు. ఈ వాక్సిన్ వల్ల పుట్టుకొచ్చిన యాంటీ బాడీలు హెచ్ఇవీ పరీక్షలో కలుగజేసుకుంటుండటం చూసి ఖంగుతిన్నారు. వారికి హెచ్ఐవి పరీక్ష చేయడం ద్వారా పాజిటివ్ గా తేలింది. దీంతో వెంటనే వాక్సిన్ ట్రయల్స్ ను నిలిపివేశారు.
మరోసారి అదే వ్యక్తులకు మరో సారి పరీక్షలు చేయగా హెచ్ఐవి నెగిటివ్ గా తేలింది. దీంతో వారికి హెచ్ఐవి ప్రమాదం లేకపోయినా పాజిటివ్ గా చూపుతున్నట్టుగా నిర్దారించారు. వాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావం లేకపోయినా హెచ్ ఇవి పరీక్షలో యాంటీబాడీలు కలుగజేసుకోవడం వల్ల ఈ వాక్సిన్ ను పూర్తిగా రద్దు చేస్తున్నట్టుగా సీఎస్ఎల్ అధికారులు పేర్కొన్నారు.