logo

  BREAKING NEWS

8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |  

లక్షణాలు లేకున్నా.. కరోనా ఉంటె ఈ యాప్ చెప్పేస్తుంది!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 48 మిలియన్ల దాటింది. ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు వదిలారు. ఈ వైరస్ రకరకాలుగా తన రూపాన్ని మార్చుకుంటూ దాడి చేయడంతో వైరస్ సోకిన వారిలో కూడా నిర్దిష్ట లక్షణాలు పైకి కనిపించడం లేదు. ఇలా లక్షణాలు లేకుండా ఉన్న కేసులను అసింటమాటిక్ కేసులుగా గా పిలుస్తున్నారు. అయితే లక్షణాలు లేకపోయినా వీరి ద్వారా ఇతరులకు వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది.

కానీ లక్షణాలు లేని వారు పరీక్షలు చేయిస్తే తప్ప పాజిటివ్ వచ్చిన విషయం తెలియడం లేదు. కానీ అప్పటికే వీరు ఇతరులకు కూడా వైరస్ ను అంటించేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి పెరగడానికి ఇది కూడా ఒక కారణమే. ఇప్పటికే ఇలాంటి ఎన్నో అసింటమాటిక్ కేసులను పరీక్షల ద్వారానే గుర్తించగలిగారు. తాజాగా ఇలాంటి వారి కోసమే ఓ కొత్తరకమైన యాప్ ను కనుగొన్నారు పరిశోధకులు. కరోనా లక్షణాలు లేని వారు కూడా ఈ యాప్ ద్వారా పరీక్ష చేసుకుంటే పాజిటివ్ కేసులను గుర్తించి చెప్పడం ఈ యాప్ ప్రత్యేకత.

అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన రీసెర్చర్లు ఈ యాప్ ను అభివృద్ధి చేశారు. ఈ యాప్ ద్వారా కరోనా పరీక్ష చేసుకోవడం కూడా చాలా సులువు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు, కరోనా సోకిన వ్యక్తులకు మధ్య గల వ్యత్యాసాన్ని కనిపెట్టడం ద్వారా ఈ యాప్ కరోనాను నిర్దారిస్తుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పని చేసే ఈ యాప్ ను ఉపయోగించాలి అనుకునే వారు ముందుగా తమ మాటలు, దగ్గును సెల్ ఫోన్, ల్యాప్ టాప్ లేదా వెబ్ బ్రౌసర్ ద్వారా రికార్డు చేసి అందించవలసి ఉంటుంది.

కరోనా సోకిన వేలాది మంది పేషంట్ల దగ్గు, పదాల ఉచ్ఛారణను ఈ యాప్ లో ముందుగానే నిక్షిప్తం చేసి ఉంచినట్టుగా పరిశోధకులు పేర్కొన్నారు. వాటితో మన రికార్డులను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పరిశీలించి చూస్తుంది. రెండిటిని పోల్చి చూసి మనకు కరోనా ఉందా లేదా అనే విషయాన్ని తెలుపుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ యాప్ ను వినియోగించడం ఎంతో మేలని రీసెర్చర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ యాప్ ను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుపుతున్నామన్నారు.

Related News