logo

  BREAKING NEWS

ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |   ద‌సరా పండుగ రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారో తెలుసా ?  |  

ఆర్తి అగర్వాల్ తరుణ్ ప్రేమాయణం.. ఇదే అసలు కథ!

పదహారేళ్ళ వయసులోనే సినీ ఎంట్రీ ఇచ్చింది దివంగత నటి ఆర్తి అగర్వాల్. తెలుగులో మొదటి సినిమానే వెంకటేష్ సరసన ‘నువ్వు నాకు నచ్చావ్’ లో ఛాన్స్ కొట్టేసి లక్కీ హీరోయిన్ గా ముద్ర వేసుకుంది. ఆ తర్వాత ‘నువ్వు లేక నేను లేను’ సినిమాలో తరుణ్ తో కలిసి నటించింది. 2002 లో విడుదలైన ఈ సినిమా ఘన విజయం నమోదు చేసుకుంది. ఈ సినిమాతో ఆర్తి అగర్వాల్ కెరీర్ ఊపందుకుంది. అదే సమయంలో ఆర్తి పై అనేక రూమర్లు వచ్చాయి. అందులో తరుణ్ తో ప్రేమాయణం సాగించింది వచ్చిన వార్త మిస్టరీగానే మిగిలిపోయింది.

సినీ పరిశ్రమలో రూమర్లు సర్వసాధారణమే. కానీ 2005లో ఆర్తి అగర్వాల్ విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించడం సంచలనంగా మారింది. దీంతో తరుణ్ తో ప్రేమ విఫలమైన కారణంగానే ఆర్తి ఆత్మహత్యకు ప్రయత్నించిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ వార్తలపై ఎవ్వరు పెదవి విప్పకపోవడంతో ఇప్పటికీ నిజం ఏమిటో ఎవరికీ తెలియలేదు. అయితే తరుణ్ తో ఆర్తి ప్రేమాయణంపై తరుణ్ తల్లి, సీనియర్ నటి రోజారమని తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు.

ఆర్తి తరుణ్ ను ప్రేమించిందని వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. వారిద్దరూ కలిసి సినిమాలు చేసారు. ఇద్దరూ మంచి స్నేహితులు. ఆర్తిని రెండు సార్లు కలిసాను. ఎంతో డీసెంట్ గా, హుందాగా ప్రవర్తించేది అని తెలిపారు. గతంలో కూడా ఆమె ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ .. ఒక వేళ వారిద్దరూ ప్రేమించుకుని ఉంటె పెళ్లి చేసుకునే వారు కదా. వారి పెళ్ళికి మేము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజమైన ప్రేమ అయితే పెళ్లి చేసుకుని తీరతారు. వీరి విషయంలో అలాంటిదేమీ జరగలేదు.

అంతేకాదు ఈ రూమర్లు వచ్చిన కొంత కాలానికి ఆర్తి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తాను నిజంగా తరుణ్ ను ప్రేమించి ఉంటె పెళ్లి చేసుకునేది కాదు. నాకు తెలిసి ఏ అమ్మాయి అలా చేయదు. ఇక తరుణ్ ఆమె ప్రేమను కాదన్నాడని ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది అనడం అర్థం లేని వ్యాఖ్యలుగా ఆమె కొట్టిపారేశారు. కాగా 2015 లో ఆర్తి అగర్వాల్ బరువు తగ్గించుకునేందుకు లైఫో సెక్షన్ సర్జరీని చేయించుకున్నారు. ఆ సమయంలో సర్జరీ వికటించి గుండెపోటుతో ఆమె మరణించారు.

Related News