logo

  BREAKING NEWS

బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |  

సికింద్రాబాద్ లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ.. పూర్తి వివరాలు!

తెలంగాణ యువతకు శుభవార్త. సికింద్రాబాద్ ఏవోసీ సెంటర్ లో నిరుద్యోగ యువత కోసం ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని చేపట్టనున్నారు. 2021 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఈ ర్యాలీ కొనసాగానున్నట్టుగా భారత ఆర్మీ ఓ నోటోఫికేషన్ ను విడుదల చేసింది. కాగా వచ్చే ఏడాది కరోనా వైరస్ పరిస్థితులకు అనుగుణంగా ర్యాలీ నిర్వాహిస్తారు.

పోస్టుల వారీగా చూసుకుంటే.. సోల్జర్‌ టెక్నికల్, సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ, సోల్జర్‌ ట్రేడ్స్‌మెన్, ఔట్‌స్టాండింగ్‌ స్పోర్ట్స్‌మెన్‌(ఓపెన్‌ కేటగిరీ) లలో ఉన్నాయి. అలాగే బాక్సింగ్, ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్ బాల్, హ్యాండ్ బాల్, హాకీ, స్విమ్మింగ్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, కబడ్డీ వంటి ఆటలలో నైపుణ్యం ఉన్నవారికి 2021 జనవరి 15న సికింద్రాబాద్ లోని థాపర్ స్టేడియంలో స్పోర్ట్స్ ట్రయల్స్ నిర్వహిస్తారు.

అభ్యర్థులు అదే రోజున రిపోర్టు చేయవలసి ఉంటుంది. అభ్యర్థులకు నేషనల్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్‌లో సీనియర్ లేదా జూనియర్ లెవెల్‌లో సర్టిఫికెట్లు పొంది ఉండాలి. అయితే స్క్రీనింగ్ నుంచి రెండేళ్లలోపు సర్టిఫికెట్లను మాత్రమే పరిగణలోకి తీసుకోనున్నారు. అంతకన్నా పాతవి పనిచేయవు.

భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు:
సోల్జర్ టెక్ (AE),
సోల్జర్ జనరల్ డ్యూటీ (GD),
సోల్జర్ ట్రేడ్‌మెన్,
ఔట్‌స్టాండింగ్ స్పోర్ట్ మెన్ (ఓపెన్ కేటగిరీ)

విద్యార్హతలు:
సోల్జర్ జనరల్ డ్యూటీ (GD) పోస్టుకు మెట్రిక్యులేషన్ లేదా ఎస్ఎస్‌సీ 45 శాతం మార్కులతో పాస్ కావాలి.
ప్రతీ సబ్జెక్ట్‌లో కనీసం 33 శాతం మార్కులు ఉండాలి.
సోల్జర్ ట్రేడ్‌మెన్ పోస్టుకు 10వ తరగతి ఉత్తీర్ణత కావాలి.
సోల్జర్ టెక్ (AE) పోస్టుకు సైన్స్ సబ్జెక్ట్‌తో 10+2 పాస్ కావాలి.
సోల్జర్ Clk/SKT పోస్టుకు 10+2 లేదా ఇంటర్మీడియట్ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత కావాలి.

అభ్యర్థుల వయస్సు:
సోల్జర్ జనరల్ డ్యూటీ (GD) కేటగిరీకి 17.5 నుంచి 21 ఏళ్లు, ఇతర కేటగిరీలకు 17.5 నుంచి 23 ఏళ్లు ఉండాలి.

పూర్తి వివరాల కోసం http://www.joinindianarmy.nic.in/ వెబ్ సైట్ ను చూడగలరు.

 

Related News