logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

30 లక్షల మందికి నిర్మించబోయే ‘జగనన్న కాలనీలు’.. ప్రత్యేకతలు ఇవే!

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతుంది. ఈరోజు విజయనగరం జిల్లాలో జరుగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. అనంతరం విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన గుంకలాంలోని ‘వైఎస్సార్‌ జగనన్న కాలనీ’ పైలాన్‌ను సీఎం జగన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గృహ నిర్మాణాలకు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఇళ్ల లబ్ధిదారులతో జరిగిన ముఖాముఖీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వారితో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

‘వైఎస్సార్ జగనన్న కాలనీ’ ల ప్రత్యేకతలు:

ఏపీ ప్రభుత్వం నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు కార్యరామం ద్వారా జిల్లా కేంద్రమైన విజయనగరం మండలంలోని గుంకలాం గ్రామంలో 357.50 ఎకరాల్లో అతి పెద్ద లేఅవుట్‌ రూపొందిస్తున్నారు. ఈ లే అవుట్లకు ‘వైఎస్సార్ జగనన్న కాలనీలు’ అని పేరు పెట్టారు. ప్రతి లబ్ధిదారుడికి ఒక బెడ్‌రూమ్, పెద్ద హాలు, కిచెన్, వరండా, టాయిలెట్‌ సదుపాయాలతో ఇళ్లను నిర్మిస్తున్నారు. వాటికి విద్యుత్తూ, డ్రైనేజి వ్యవస్థ, మంచినీటి సరఫరా వంటి అని సదుపాయాలు కల్పించనున్నారు.

విద్యా సంస్థలు, ఆస్పత్రులు, పార్కులు లాంటి మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేకంగా ఖాళీ స్థలాలు వదిలేసి ప్లాట్లు నిర్మిస్తున్నారు. వాటితో పాటుగా పోలీస్‌ స్టేషన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, రైతు బజార్లు అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందించనున్నారు. ఇక సామాజిక అవసరాల కోసం అవసరమైన ఖాళీ స్థలనను వదిలేసి ప్లాట్లు నిరించాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కాలనీలాన్ని పచ్చదనంతో ఆహ్లాదంగా ఉండేలా వీటి ప్లాన్ ను రూపొందించారు.

Related News