logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

దారుణం: మాస్కు వేసుకోమన్నందుకు మహిళా అధికారిని చితక్కొట్టాడు

కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో మాస్కు ధరించాలని సూచించిన సహోద్యోగినిపై ఓ అధికారి అమానుషంగా వ్యవహరించాడు. ఆమె జుట్టు పట్టుకుని చితక్కొట్టాడు. ఘటన జరిగిన సమయంలో తోటి ఉద్యోగులు అతన్ని అడ్డుకోవడం వల్ల ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. అక్కడున్న సిసి టీవీల్లో ఈ దృశ్యాలు రికార్డు కావడంతో ఇప్పుడు ఈ దారుణం వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని ఆంధ్రప్రదేశ్‌ టూరిజం హోటల్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. కార్యాలయంలో ఉద్యోగులంతా భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కు ధరిస్తున్నారు. అయితే డిప్యూటీ మేనేజర్ భాస్కర్ మాత్రం మాస్కు ధరించకపోవడంతో కాంట్రాక్టు ఉద్యోగిని ఉషారాణి ప్రశ్నించింది. దీంతో కోపోద్రిక్తుడైన భాస్కర్ విచక్షణా రహితంగా ఉషారాణిపై దాడికి పాల్పడ్డాడు.

అనంతరం కార్యాలయంలోని ఉద్యోగులంతా కలిసి ఉషారాణితో పోలీసులకు ఫిర్యాదు చేయగా భాస్కర్ పై కేసు నమోదు చేసారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Related News