ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పలు ఈరోజు జిల్లాలో పర్యటించవల్సి ఉంది. అయితే ఆకస్మికంగా ఈరోజు పర్యటనను ఎస్ఈసీ రద్దు చేసుకున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వల్ప అస్వస్థతకు గురైనట్టుగా సమాచారం అందుతుంది. కంటి ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయన ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నట్టుగా తెలుస్తుంది.
కాగా పంచాయతి ఎన్నికలకు సంబందించిన తొలి విడత పోలింగ్ రేపటి నుంచి జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లను ఆయా జిల్లాల్లో పర్యటించి పరీక్షించనున్నారు. కాగా కంటి ఇన్ఫెక్షన్ కారణంగా ఎస్ఈసీ ఈరోజు కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో పర్యటనను రద్దు చేసుకున్నారు. పంచాయతీ ఎన్నికలలపై ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.
వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం కోరగా అందుకు ఎన్నికల సంఘం నిరాకరించింది. మరోవైపు ఉద్యోగ సంఘాలు సైతం ప్రభుత్వానికి మద్దతు తెలపడంతో ఈ అంశం మరింత వివాదాస్పదంగా మారింది. చివరకు సుప్రీం కోర్టు తీర్పుతో ఏపీలో పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించింది.