పంచాయతీ ఎన్నికల పై సుప్రీం కోర్టు తీరు నేపథ్యంలో ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లకు వడివడిగా అడుగులు వేస్తుంది. గతంలో ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ మేరకు ఈరోజు నుంచే ఏపీలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావలసి ఉండగా ఎన్నికల విధులకు హాజరు కాకుండా ఉద్యోగ సంఘాలు సహాయనిరాకరణను ప్రకటించాయి.
ఈనేపథ్యంలో సుప్రీం ధర్మాసనం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సిద్ధంగా లేనందున ఎన్నికలను రీ షెడ్యూలు చేసింది ఎస్ఈసీ. కాగా పంచాయతీ ఎన్నికలకు ఉద్యోగ సంఘాలు ఇప్పటికీ సహకరించకపోతే కేంద్ర ఉద్యోగుల సహాయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించుకుంది.
ఈ మేరకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర కేబినెట్ సెక్రటరీకి లేఖ రాశారు. ఎన్నికల ప్రక్రియకు ఉద్యోగ సంఘాలు సహకరించమంటే చేసిన ప్రకటనపై ఆయన లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు సహకరించకుంటే వారి స్థానంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకులే అవకాశం ఇవ్వాలని లేఖలో కోరారు.