logo

  BREAKING NEWS

మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |   ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ నోటిఫికేషన్ రద్దు!  |   బ్రేకింగ్: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..!  |   మున్సిప‌ల్ ఎన్నిక‌లపై సీక్రెట్ స‌ర్వే.. రిజ‌ల్ట్ చూసి షాకైన జ‌గ‌న్‌  |   బంగారం కొనేవారికి బ్యాడ్‌ న్యూస్.. పెరిగిన బంగారం ధ‌ర‌లు  |   బ్రేకింగ్: నిమ్మగడ్డ వివాదాస్పద నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు.. భారీ ఎదురుదెబ్బ!  |   ఆనాడు జగన్ ను అడ్డుకున్నారు.. బాబుపై ఏపీ మంత్రి ధ్వజం  |   మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!  |   హైటెన్షన్: చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. ఎయిర్పోర్టులో బైఠాయింపు!  |  

ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్న ఎన్నికల సంఘం ఈ మేరకు అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించుకుంది. పంచాయతీరాజ్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరాజ శంకర్‌ లను సమావేశానికి హాజరుకావాలని ఆదేశించింది.

అయితే ఈ సమావేశానికి వారిద్దరూ హాజరుకాకపోవడంతో ఈ విషయాన్నీ నిమ్మగడ్డ తీవ్రంగా పరిగణిస్తుంది. అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అయితే గోపాలకృష్ణ ద్వివేది, గిరాజ శంకర్‌లకు ఎన్నికల సంఘం డెడ్ లైన్ విధించింది. సాయంత్రం 5 గంటలలోపు వారిద్దరూ అధికారులు తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.

అయితే ఎస్ఈసీ ఇచ్చిన గడువు మించిపోయినప్పటికీ అధికారులిద్దరూ సమావేశానికి హాజరుకాలేదు. దీంతో ఎన్నికల సంఘం తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ ఇద్దరు అధికారులు క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశం కావడం విశేషం.

Related News