జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ఆదేశాలు జారీ చేసారు. గతంలో నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం ఇస్తున్నట్టుగా నిమ్మగడ్డ ప్రకటించారు. గతంలో ప్రలోభాలు, బెదిరింపులకు గురై నామినేషన్లు వేయలేకపోయిన వారు మరో అవకాశం కల్పిస్తామని నిమ్మగడ్డ పేర్కొన్నారు.
అభ్యర్థులంతా ఈ నెల 20 లోపు సాక్ష్యాలతో సహా జిల్లా కలెక్టర్ ను కలవాలని పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా నిమ్మగడ్డ తెలిపారు. ఈ అంశంపై కలెక్టర్లు ఇచ్చే నివేదికల ప్రకారం న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అభ్యర్థులు గతంలో నామినేషన్ సమయంలో రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు చేసిన ఫిర్యాదు పత్రాలను కూడా సమర్పించాలని ఎస్ఈసీ పేర్కొంది. ఒక వేళ ఆధారాలు లేకపోతే మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా కూడా కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల కమిషన్ ప్రకటన ద్వారా తెలిపింది.