ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీం సంచలన తీర్పునిచ్చింది. ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం తో పాటుగా ఎన్జీవోలు దాఖలు చేసిన ఇతర పిటిషన్లు అన్నిటె కోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలో యథావిధిగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. రాజకీయ ప్రక్రియలో భాగమైన ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయడానికి వీలు లేదని తేల్చి చెప్పింది.
కోర్టు తీర్పుతో ఏపీలో పంచాయతీ ఎన్నికలపై సస్పెన్స్ వీడింది. ఈ నేపధ్యంలో ఎస్ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సిద్ధం కానందున పంచాయతీ ఎన్నికలను రీ షెడ్యూలు చేస్తున్నట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో ఇచ్చిన షెడ్యూలు ప్రకారం రెండో దశలో జరగాల్సిన ఎన్నికల స్థానంలో మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి.
అలాగే మూడో దశను రెండో దశగా మార్చనుంది ఎన్నికల సంఘం. ఇక నాలుగో దశను మూడో దశగా మార్చారు. మొదటి దశ నోటిఫికేషన్ ను వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్టుగా ఎస్ఈసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మొదటి దశ నామినేషన్లను ఈ నెల 29 నుంచి స్వీకరించనున్నారు. తాజా నిర్ణయం ప్రకారం ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీలలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.