logo

  BREAKING NEWS

మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |   ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ నోటిఫికేషన్ రద్దు!  |   బ్రేకింగ్: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..!  |   మున్సిప‌ల్ ఎన్నిక‌లపై సీక్రెట్ స‌ర్వే.. రిజ‌ల్ట్ చూసి షాకైన జ‌గ‌న్‌  |   బంగారం కొనేవారికి బ్యాడ్‌ న్యూస్.. పెరిగిన బంగారం ధ‌ర‌లు  |   బ్రేకింగ్: నిమ్మగడ్డ వివాదాస్పద నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు.. భారీ ఎదురుదెబ్బ!  |   ఆనాడు జగన్ ను అడ్డుకున్నారు.. బాబుపై ఏపీ మంత్రి ధ్వజం  |   మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!  |   హైటెన్షన్: చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. ఎయిర్పోర్టులో బైఠాయింపు!  |  

ఏపీ పంచాయతీ వార్: జగన్ సర్కార్ ఆదేశాలకు ఎస్ఈసీ నో..!

ఏపీ పంచాయతీ ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు గందరగోళంగా మారాయి. ఇటీవల మంత్రి పెద్ది రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేశామని .. నిమ్మగడ్డ ఇంకా ఎంతమందిని బదిలీ చేసుకుంటారో ఆయన ఇష్టం అంటూ ప్రకటించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, పంచాయతీ రాజ్ కమిషనర్ గిరిజా శంకర్ లను బదిలీ నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వెల్లువెత్తాయి. కానీ అనూహ్యంగా ఎన్నికల సంఘం మరో ప్రకటనతో ట్విస్ట్ ఇచ్చిది.

అధికారుల బదిలీ ప్రతిపాదనను రాష్ట్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఎన్నికల ప్రక్రియ కీలక దశలో ఉన్నప్పుడు అధికారులను బదిలీ చేయడం సరైన నిర్ణయం కాదని తెలిపింది. ఒకవేళ బదిలీ చేయాలనుకంటె దానికి ఎన్నికల విధి విధానాలను పాటించాలని సూచించింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకే రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలైందని ఇప్పుడు అధికారులను బదిలీ చేసి వారి స్థానంలో కొత్త అధికారులను నియమించడం వలన ఎన్నికల ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఎస్ఈసీ పేర్కొంది.

Related News