logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం!

ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో రిజర్వేషన్ పద్ధతులు కూడా ఉంటాయి కాబట్టి నామినేషన్ వేసే అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు.

ఈమేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాసారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల పర్యటనల్లో ఉద్యోగులు పాల్గొనరాదన్నారు. ఉద్యోగులపై కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్నారు. మంత్రులు సలహాదారులు, ప్రభుత్వ వాహనాల వినియోగం పై ఆంక్షలు విధించారు. పంచాయతీ ఎన్నికల్లో పాత ధ్రువీకరణ పత్రాలను అనుమతించాలని అన్నారు. కొత్త ధ్రువీకరణ పాత్రల కోసం అభ్యర్థులపై ఒత్తిడి తేవద్దన్నారు. కొత్త ధ్రువీకరణ పత్రాలను సమర్పించే అభ్యర్థులకు నిర్ణీత సమయం ఇవ్వాలన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో ఫాస్ట్ ట్రాక్ విధానం ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని అన్నారు. పోటీ చేసే అభ్యర్థులు బకాయిలు చెల్లించేందుకు వస్తే వెంటనే తీసుకోవాలని ఆదేశించారు. కుల ధ్రువీకరణ పత్రాలపై సీఎం జగన్ ఫోటో లేకుండా చూడాలని గతంలో ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసందే.

Related News