logo

  BREAKING NEWS

ఫలించిన ‘శ్వేత రాయబారం’.. మనసు మార్చుకున్న బుద్ధా!  |   హిందూపురంలో సీన్ రిపీట్.. అభిమానికి విశ్వరూపం చూపించిన బాలయ్య!  |   నా అనుచరుడు ఒక్కడు చాలు.. నీ పని ఖతం: టీడీపీలో బుద్ధా వర్సెస్ కేశినేని  |   అవును అప్పులు చేసాం.. ఆ విషయం గర్వంగా చెప్తాం : మంత్రి బుగ్గన  |   షాకింగ్ సర్వే.. హైదరాబాద్ లో ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా!  |   అసెంబ్లీ ఎన్నికల ముందు కేరళ సీఎంకు షాక్.. విజయన్ మెడకు మళ్ళీ అదే కేసు!  |   హై కోర్టుకు ఎన్నికల సంఘం క్షమాపణలు.. ఎందుకంటే?  |   ఇదేనా దోస్తానా..? ఏపీలో అడుగుపెడుతున్న ఎంఐఎం  |   మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |  

 గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?

పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్ఫు నేపథ్యంలో ఏపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఎస్ఈసీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పలు అంశాలను ఆయన గవర్నర్ ముందుంచనున్నారు.

ఎన్నికలపై హై కోర్టులో ఎస్ ఈసీ దాఖలుచేసిం రిట్ పిటిషన్, కోర్టు తీర్పు అనంతరం చోటుచేసుకున్న పరిణామాలను గవర్నర్ కు వివరించనున్నారు. నాలుగు రోజుల్లో వెలువరించనున్న ఎన్నికల షెడ్యూల్ పై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. ఇక కోర్టు తీర్పుతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లేనని ఎన్నికల సంఘం చెప్తుంది.

ఏపీ ప్రభుత్వం మాత్రం హై కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఈరోజు సుప్రీం ను ఆశ్రయించనుంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలపై మరోసారి సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ నెల 23న తొలి దశ, 27న రెండో దశ, 31న మూడో దశ, ఇక ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. కరోనా నేపథ్యంలో ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు జరగనుంది.

Related News