logo

  BREAKING NEWS

భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |   మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |   నువ్వు దేవుడివి సామీ.. 1020 మంది చిన్నారుల‌కు ప్రాణాలు పోసిన మ‌హేష్  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌ను టెన్ష‌న్ పెడుతున్న త్రివిక్ర‌మ్‌  |   తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |  

రామతీర్థంలో హైటెన్షన్.. ఒకేసారి మూడు పార్టీల పర్యటన

విజయనగరం జిల్లా రామతీర్థంలో హై టెన్షన్ నెలకొంది. కొద్ది సేపటి క్రితమే వైసీపీ నేత విజయ సాయిరెడ్డి రామతీర్థానికి చేరుకున్నారు. మెట్ల మార్గం గుండా వైసీపీ నేతలతో కలిసి కోదండరాముడి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ పరిస్థితులను ఆయన పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు విశాఖ నుండి రోడ్డు మార్గంలో విజయనగరం బయలుదేరారు.

మరికొద్ది సేపట్లో చంద్రబాబు రామతీర్థానికి వెళ్లనుండటంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరో వైపు బీజేపీ నేతలు కూడా ఆలయంలోకి తమకు అనుమతివ్వాలంటూ ఆందోళన చేపట్టారు. రామతీర్థంలో భారీగా పోలీసులు మోహరించారు. ఈ ఘటనలో ఇప్పటికే 32 మంది అనుమానితులను విచారించామన్నారు ఎస్పీ రాజకుమారి.

రామతీర్థం ఘటనను రాజకీయాలకు వాడుకోవడం సరికాదన్నారు. ఎవరైనా రెచ్చగొటేలా వ్యాఖ్యలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. కాగా శుక్రవారం రోజున కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రామతీర్థం ఆలయంలోని దేవతా మూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసారు. ఏపీలో జరుగుతున్న ఈ వరుస ఘటనలు పొలిటిక హీట్ ను పెంచేస్తున్నాయి.

విగ్రహాల ధ్వంసం ఘటన చంద్రబాబు, నారా లోసకేష్ కనుసన్నల్లోనే జరిగిందంటూ నిన్న వైసీపీ లీడర్ విజయసాయి రెడీ సంచలన ఆరోపణలు చేయగా.. సింహాద్రి అప్పన్న ఆలయానికి వచ్చి వారు చేస్తున్న ఆరోపణలు నిరూపించుకోవాలంటూ నారా లోకేష్ సీఎం జగన్ కు, వైసీపీ నేతలకు ట్విట్టర్ లో సవాల్ విసిరారు.ఈ నేపథ్యంలో మూడు పార్టీలు రామతీర్థానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

Related News