logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

మాస్కు ధరించని వారికి షాకిస్తున్న పోలీసులు..!

కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయినా కొందరు ఇవేవీ పట్టనట్టుగా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో కరోనా మరింత వేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఏపీ రాష్ట్ర పోలీసులు వీటికి చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వచ్చే వారికీ షాకిస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు ఇప్పటికే ఈ రూల్ ను అమలు చేస్తుండగా… మాస్క్ లేకుండా ఎవరు కనిపించినా వారిని నేరుగా క్వారెంటైన్ కు తరలిస్తున్నారు. ఆదివారం నుండి ఈ ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

పాలకొల్లు, తాడేపల్లి గూడెం లో పోలీసులు క్వారెంటైన్ కేంద్రాలకు తరలిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇదే రూల్ ను ఏలూరు, భీమవరం, నరసాపురం లో కూడా అమలు చేస్తున్నారు. ప్రజలెవరూ మాస్కులు ధరించకుండా బయటకు రావద్దని పోలీసులు మరోసారి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Related News