టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈరోజు ఉదయం ఆయన రాయపూడి వద్ద జరగనున్న బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో వెలగపూడి వద్ద పోలీసులు ఆయన కాన్వాయ్ ను అడ్డుకున్నారు. రాయపూడి వెళ్లేముందు ఉద్దండరాయుని పాలెంలోని శంకుస్థాపన ప్రదేశానికి వెళ్ళడానికి చంద్రబాబు ప్రయత్నించారు.
శంకుస్థాపన ప్రదేశంలోకి వెళ్ళడానికి అనుమతి లేకపోవడంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో బాబు పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. అనుమతులు ఉన్నా తమను పోలీసులు కావాలనే అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే విజయవాడ దుర్గగుడిలో అమ్మవారి దర్శనం చేసుకున్నారు చంద్రబాబు.
కాగా బాబు కాన్వాయ్ ను ఉండవల్లి మీదుగా వెళ్లేందుకు పోలీసులు క్లియరెన్స్ ఇచ్చారు. ఉండవల్లి గుహల మీదుగా కృష్ణాయపాలెం మీదుగా రాయపూడి వెళ్లేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా రాయపూడిలో జనరణ భేరి పేరుతో జరుగుతున్న బహిరంగ సభలో చంద్రబాబు అమరావతి ఆందోళనకారులను కలుసుకోనున్నారు.