మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టిచింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గమైన పుంగనూరు నియోజకవర్గంలో 85 పంచాయతీ స్థానాల ఉంటె అందులో మొత్తం 85 స్థానాలను వైసీపీ ఏకగ్రీవం నమోదు చేసుకుంది. పుంగనూరు నియోజకవర్గంలో మొత్తం 6 మండలాలు ఉండగా అందులో ఐదు మండలాల్లోని 85 పంచాయతీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. కాగా ఈ స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గమైన మాచర్లలో 77 స్థానాలకు గాను 74 స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుని సత్తా చాటింది.