logo

  BREAKING NEWS

ఆంధ్రప్రదేశ్ కు కొత్త డెప్యూటీ సీఎం.. ఆ సీనియర్ నేతపైనే ఫోకస్!

ఏపీ మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో రెండు మంత్రి పదవుల భర్తీకి దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేసారు సీఎం జగన్. అయితే ఇప్పుడు వీరిద్దరికి ఎలాంటి శాఖలు అప్పగిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. మరోవైపు పిల్లి సుభాష్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న నేపథ్యంలో గతంలో ఆయన నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పదవి ఖాళీగా ఉంది. ముఖ్యమంత్రి తర్వాత అంత కీలకమైన పదవి ఇదే. పాలనా పరంగా అంతగా ప్రాధాన్యం లేకపోయినా.. రాజ్యంగా పరంగా ఇది అత్యంత కీలకమైన పోస్టు. ఇప్పుడు ఈ పదవి ఎవరికి దక్కబోతోంది అనే విషయంపై వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది.

పిల్లి సుభాష్ స్థానంలో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణను కాబినెట్ మంత్రిగా ఎంపిక చేసారు. అయితే ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కారణంగా ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం లేనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ లో సీనియర్ గా పేరున్న ధర్మాన కృష్ణదాస్‌‌ను ఈ పదవి వరించనుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయం దాపుగా ఖరారైపోయింది. అయితే ఏయే శాఖలను ఆయనకు అప్పగిస్తారనే విషయం తెలియాల్సి ఉంది.

మొదటి నుండి బీసీ సామజిక వర్గానికి వారికి జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో మరోసారి అదే పద్దతని కొనసాగిస్తారని అనుకుంటున్నారు. ఇప్పటివరకు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో కొనసాగిన వారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు సామజిక వర్గానికి చెందిన వారే ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు శ్రీకాకుళం నేత ధర్మాన కృష్ణ దాస్ కూడా వెనుకబడిన వర్గానికి చెందిన వారే. ధర్మ కృష్ణ దాస్ ఇప్పుడు ఆర్ అండ్ బీ శాఖా మంత్రిగా కొనసాగుతున్నారు.

Related News