హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలయ్యపై ఏపీ పౌర సరఫరాల శాఖమంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న బాలయ్య వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రుల కు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయడం లేదన్నారు.
కాగా బాలయ్య వ్యాఖ్యలపై కొడాలి నాని తీవ్రంగా తీవ్రంగా స్పందించారు. బాలయ్య షూటింగుల కోసం దేశాలు, రాష్ట్రాలు తిరుగుతున్నారన్నారు. అందుకే రాష్ట్రంలో పరిస్థితులపై ఆయనకు అవగాహన లేదన్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప ఆయనకు ఏమీ తెలియదు. బాలయ్య ఆటలో అరటిపండు లాంటి వాడని ఘాటు వ్యాఖ్యలు చేసారు.
ఇదిలా ఉండగా ప్రచారంలో భాగంగా బాలయ్య మరోసారి తన మార్కును చూపారు. ఓ కార్యకర్త ఇంటికి వెళ్లిన బాలయ్య వారితో మాట్లాడుతుండగా వీడియో తీసాడనే కోపంతో అతని చెంప చెళ్లుమనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాగా కొడాలి నాని బాలయ్యపై చేసిన వ్యాఖ్యలు మరింత కాక రేపుతున్నాయి.