logo

  BREAKING NEWS

గుడ్ న్యూస్‌: క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది..!  |   వైఎస్సార్‌, చంద్ర‌బాబు స్నేహ‌బంధంపై సినిమా  |   క‌రోనా ఖతం అయ్యే డేట్ చెప్పిన బిల్ గేట్స్‌  |   నిజంగానే పాపం త‌గిలిన‌ట్లుంది… క‌రోనాతో ఆ ఎస్సై మృతి  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వల్ల కూడా ఆ ప‌ని కాదు.. కొడాని నాని హాట్ కామెంట్స్‌  |   బ్రేకింగ్‌: మాజీ రాష్ట్ర‌ప‌తికి క‌రోనా పాజిటీవ్‌  |   క‌న్న‌డ దంప‌తుల ధైర్యం… పీఓకేలోని శార‌దాపీఠం నుంచి అయోధ్య‌కు ప‌విత్ర మ‌ట్టి  |   పాక్ నుంచి వ‌చ్చిన ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మ‌హ‌త్య‌  |   విజ‌య‌వాడ కోవిడ్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాలివే..!  |   ప్లాస్మా దానం అంటే ఏమిటి ? ఎవ‌రు చేయాలి ? ఎలా చేయాలి ?  |  

ఏపీలో మద్య నియంత్రణపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

ఏపీ లో మద్య నియంత్రణపై జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మద్యపాన నిషేదంలోభాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులను తగ్గించి, మద్యం ధరలను భారీగా పెంచేసింది ప్రభుత్వం. దీంతో మద్యానికి భారీగా డిమాండ్ ఏర్పడింది.ఈ అవసరాన్ని సొమ్ముచేసుకోవడానికి అక్రమార్కులు కొత్త వ్యాపారానికి తెరతీస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా కు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఏపీ సర్కార్ వీరిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

రాష్ట్రంలోకి ఎవరైనా అక్రమంగా మద్యం తీసుకువచ్చినా, మద్యాన్ని తరలించే ప్రయత్నం చేసినా వారిపై ఉక్కుపాదం మోపనుంది. అందుకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోకు చట్టబద్దత కల్పించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీసులు, ఎక్సయిజ్ అధికారులు అక్రమార్కుల పని పట్టడానికి సిద్ధమయ్యారు.

అయితే సరిహద్దుల్లో అక్రమ మద్యం రవాణాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం ఎవరైనా అక్రమ మద్యం రవాణా చేస్తూ పట్టుబడితే వారిపై కఠిన చర్యలకు ఆదేశిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అక్రమంగా మద్యం చేరవేస్తూ పట్టుబడితే నాన్ బెయిలబుల్ కేసులతో పాటుగా మళ్ళీ ఇదే తరహా నేరానికి పాల్పడిన వారికి 8 ఏళ్ల జైలు శిక్షను విధిస్తారు. ఇక సాధారణ కేసుల విషయంలోనూ అంతే కఠినంగా వ్యవహరిస్తోంది ప్రభుత్వం. వారికి కూడా రెండేళ్లకు మించకుండా జైలు శిక్ష విధించే విధంగా చట్టాలను సవరించింది.

Related News