ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరగాల్సిన కార్పొరేషన్ ఎన్నికలను నిలిపి వేయాల్సిందిగా హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల జాబితాకు సంబదించి హై కోర్టులో దాఖలైన పిటిషనలపై న్యాయస్థానం విచారించనుంది. ఈ సందర్భంగా ఎన్నికలను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.
మార్చి 10 వ తేదీన ఏలూరులో కార్పొరేషన్ నిర్వహించాల్సి ఉండగా ఓటర్ల జాబితాపై సందిగ్దత నెలకొంది. కొంత మంది ఓట్లు లేకపోవడం, మరికొందరు ఓటర్లకు రెండు సార్లు పేరు నమోదు కావడం వంటి సమస్యలు ఉండటంతో దీనిపై హై కోర్టులో పిటీషన్ దాఖలైంది