ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు చుక్కెదురైంది. ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిన ఈ-వాచ్ యాప్ పై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు గురువారం నాడు విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా ఈ ఈ వాచ్ యాప్ అమలు పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. యాప్ కు సంబందించిన భద్రతా ధ్రువపత్రాలు తమకు అందలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అందుకోసం మరో 5 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని వివరించారు. దీంతో ఈ నెల 9 కి విచారణను కోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు యాప్ ను అమలులోకి తీసుకురావద్దని ఆదేశాలు జారీ చేసింది.
పాత యాప్ ల స్థానంలో ఎస్ ఈసీ కొత్త ఈ వాచ్ యాప్ ను ప్రవేశపెట్టగా ఇది పూర్తిగా ప్రయివేట్ యాప్ అని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. రాష్ట్రంలో ఈ యాప్ అమలును సవాలు చేస్తూ హై కోర్టులో ప్రభుత్వం పిటిషన్ ను దాఖలు చేసింది. అధికార పార్టీకి నష్టం కలుగజేసేందుకే నిమ్మగడ్డ ఈ యాప్ ను రోపొందించారని వైసీపీ ఆరోపిస్తుంది.