ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి హై కోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కాగా దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈరోజు సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ ఇచ్చిన షెడ్యూలును కోర్టు కొట్టివేసింది. ఏపీలో కరోనా వాక్సిన్ పంపిణీ, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా దీనిపై ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తుందని విషయం ఆసక్తికరంగా మారింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీలో ఇప్పట్లో స్థానిక ఎన్నికలు లేనట్టే అని స్పష్టమవుతుంది. ఎన్నికల సంఘం కోర్టు తీర్పుపై సుప్రీం ను ఆశ్రయించే అవకాశం కూడా లేకపోలేదు.