జూనియర్ సివిల్ జడ్జి నోటిఫికేషన్ ను రద్దు చేస్తా ఏపీ హై కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. 2020 లో సివిల్ జడ్జిల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కాగా మూడేళ్ళ పాటు న్యాయవాదులుగా పనిచేసినవారే ఈ పోస్టులకు అర్హులుగా నోటిఫికేషన్ లో నిబంధనలు విధించింది.
ఈ నోటిఫికేషన్ ను సవాలు చేస్తూ ఏపీ ఏప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై తాజాగా కోర్టు విచారణ చేపట్టింది. ఈ నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చింది. దీని స్థానంలో కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేయాల్సిందిగా కోర్టు పేర్కొంది.