logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

కరోనా వాక్సిన్ పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

దేశవ్యాప్తంగా రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఇందులో భాగంగా 60 ఇండ్లు పైబడిన వారితో పాటు 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికీ వాక్సిన్ వేస్తున్నారు. ప్రధాని మోదీతో సహా పలువురు ప్రముఖులు ఇప్పటికే వాక్సిన్ వేయించుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా వాక్సిన్ అందుబాటులో ఉంది.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా వాక్సిన్ తీసుకునే వారు ముందుగా తమ పేరును ఆన్ లైన్ విధానంలో రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం మేరకు 60 ఇండ్లు పైబడిన వారికీ ఇందులో నుంచి మినహాయింపు లభించింది. వీరు ఆన్ లైన్ లో పేరు రిజిస్టర్ చేసుకోకపోయినా నేరుగా ఆసుపత్రులకు వెళ్లి టీకా వేయించుకోవచ్చు.

అందుకోసం ఏదైనా గుర్తింపు కార్డును చూపితే సరిపోతుంది. అలాగే 46 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు డాక్టర్ సంతకం చేసిన సెర్టిఫికెట్ ను తీసుకెళ్లాలి. సెర్టిఫికెట్ లేని వారు వారికి సంబందించిన బ్లడ్ టెస్టులు, మందుల ప్రిస్క్రిప్షన్ లాంటి ఏవైనా చూపితే ఆయా ఆసుపత్రుల్లోని వైద్యుల నుంచి ఒక ధ్రువ పత్రం లభిస్తుంది.

దాని ద్వారా వాక్సిన్ వేయించుకోవచ్చు. ఈ విషయాన్ని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఉన్న ఆసుపత్రుల్లో టీకాలు తీసుకోవచ్చని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా టీకాలు వేస్తున్న ఆసుపత్రుల వివరాలను cowin.gov. in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

 

Related News