logo

  BREAKING NEWS

గుడ్ న్యూస్‌: క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది..!  |   వైఎస్సార్‌, చంద్ర‌బాబు స్నేహ‌బంధంపై సినిమా  |   క‌రోనా ఖతం అయ్యే డేట్ చెప్పిన బిల్ గేట్స్‌  |   నిజంగానే పాపం త‌గిలిన‌ట్లుంది… క‌రోనాతో ఆ ఎస్సై మృతి  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వల్ల కూడా ఆ ప‌ని కాదు.. కొడాని నాని హాట్ కామెంట్స్‌  |   బ్రేకింగ్‌: మాజీ రాష్ట్ర‌ప‌తికి క‌రోనా పాజిటీవ్‌  |   క‌న్న‌డ దంప‌తుల ధైర్యం… పీఓకేలోని శార‌దాపీఠం నుంచి అయోధ్య‌కు ప‌విత్ర మ‌ట్టి  |   పాక్ నుంచి వ‌చ్చిన ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మ‌హ‌త్య‌  |   విజ‌య‌వాడ కోవిడ్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాలివే..!  |   ప్లాస్మా దానం అంటే ఏమిటి ? ఎవ‌రు చేయాలి ? ఎలా చేయాలి ?  |  

అమర్ రాజా ఇన్‌ఫ్రాటెక్ సంస్థకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం.. !

చిత్తూరులోని అమర్ రాజా ఇన్‌ఫ్రాటెక్ కంపెనీకి ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. గతంలో ఈ గ్రూపుకు కేటాయించిన భూముల నుంచి 253 ఎకరాలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది. రోశయ్య హయాంలో ఉమ్మడి ఏపీగా ఉన్న సమయంలో 2009లో చిత్తూరుకు చెందిన ఈ సంస్థకు గత ప్రభుత్వాలు చిత్తూరు జిల్లా కొత్తపల్లి, నూనె గుండ్లపల్లి గ్రామాల్లో 483.27 ఎకారాల భూమిని కేటాయించాయి.

కాగా ఈ సంస్థ ప్రభుత్వానికి అగ్రిమెంట్ లో చెప్పిన విధంగా రూ. 2,100 కోట్ల పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. ఈ సంస్థ ద్వారా 20 వేల మందికి ఉపాథి కల్పించవలసి ఉంది. ఈ రెండు హామీలను అమర్ రాజా సంస్థ నెరవేర్చలేకపోయింది. బదులుగా ఇప్పటివరకు కేవలం 4,310 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చింది. అంతేకాదు 483.27 ఎకారాల భూమిలో కేవలం 229.66 ఎకరాల భూమిని మాత్రమే వినియీగించుకుంది.

గతంలో ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం రెండేళ్ల వ్యవధిలో పూర్తి భూమిని సంస్థ వినియోగించవల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపింది. ఈ మేరకు నిరుపయోగంగా ఉన్న భూములను వెనక్కి తీసుకోవాలని ఏపీఐఐసీకి పరిశ్రమ శాఖ ఉత్తర్వుల ద్వారా తెలిపింది.

Related News