logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

సెక్స్ వర్కర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..!

కరోనా లాక్ డౌన్ కారణంగా ఉపాథి కోల్పోయిన వారిలో అన్ని తరగతుల వారు ఉన్నారు. మధ్యతరగతి కుటుంబాల నుంచి పారిశ్రమిక వ్యక్తుల దాకా కరోనా కారణంగా నష్టపోయినవారే. అయితే ఈ కారణంగా ఉపాథి కోల్పోయి దుర్భర పరిస్థితుల్లో ఉన్న సెక్స్ వర్కర్ల పరిస్థితులపై ఓ ఎన్జీవో స్పందించి ముందుకొచ్చింది.

వారికోసం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను దాఖలు చేసిన సుప్రీం ధర్మాసనం అని రాష్ట్రాల ప్రభుత్వాలు తమ రాష్ట్రాలలోని సెక్స్ వర్కర్లను గుర్తించి వారికి ఉచిత రేషన్ ను పంపిణీ చేయాలనీ ఆదేశించింది. ఆ వివరాలను కూడా తమకు అందించాలని తెలిపింది. దీంతో ఇప్పటివరకు పేద, బడుగువర్గాల వారికి అందిస్తున్న నెలవారీ ఉచిత రేషన్ ను ఇకపై సెక్స్ వర్కర్లకు కూడా అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్, లీగల్‌ ఆర్గనైజేషన్లు గుర్తించిన వారికి ఈ రేషన్ పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1.22 లక్షల మంది సెక్స్‌వర్కర్లను గురించారు. వీరిలో హోమో సెక్సువల్స్‌తోపాటు ట్రాన్స్‌జెండర్లు కూడా ఉన్నారు. ఏపీలో నవంబర్ నెల ఉంచి చౌకధరల దుకాణాలు అంగన్వాడీ సెంటర్ల ద్వారా రేషన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృతికా శుక్లా తెలిపారు.

Related News