logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

కాలేజీ ఫీజులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీలలో యాజమాన్య, కన్వీనర్, ఎన్ఆర్ఐ కోటాలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కోసం ఎంబీబీఎస్, బిడిఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజులను సవరిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. సూపర్ స్పెషాలిటీ ఫీజును రూ. 15 లక్షలకు సవరించింది.

ప్రస్తుతం ఎంబీబీఎస్ కన్వీనర్ కోటాలో ట్యూషన్ ఫీజు రూ. రూ.12,155 ఉండగా ఇప్పుడు రూ, 15 వేలకు పెంచింది. రూ.13,37,057 గా ఉన్న బీ కేటగిరీ ఫీజును రూ. 12 వేలకు తగ్గించింది. అదే విధంగా రూ.33,07, 500 గా ఉన్న సి క్యాటగిరీ ఫీజులను రూ. 36 లక్షలకు తగ్గిస్తున్నట్టుగా సవరణలు చేసింది.

తాజాగా సవరించిన ఫీజులు ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌, మైనారిటీ, నాన్‌మైనారిటీ కాలేజీలకు వర్తించనున్నాయి అని ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఎంబిబిఎస్ కు ఐదేళ్లకు గాను ఫీజులు వసూలు చేస్తుండగా ఇకపై నాలుగున్నరేళ్లకు మాత్రమే ఫీజులు తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది.

రాష్ట్రవ్యాప్తంగా ఆన్న 17 మెడికల్ కాలేజీలు, 14 డెంటల్ కాలేజీలకు ఈ ఫీజులు వర్తించనున్నాయి. కాదని ఇతర ఫీజులు వసూలు చేసిన యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా విద్యార్థులకు అందించాల్సిన ఉపకారవేతనాల్లో జాప్యం లేకుండా చూడాలని తెలిపారు.

 

Related News