logo

  BREAKING NEWS

బ్రేకింగ్: వికటించిన కరోనా టీకా.. ఆశా కార్యకర్త బ్రెయిన్ డెడ్!  |   నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల కౌంటర్: వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!  |   అమెరికా అధ్యక్షుడి ప్రసంగాల వెనుక మన తెలుగోడి ప్రతిభ  |   ‘పంచాయతీ’ నోటిఫికేషన్ ఎఫెక్ట్: షాకిస్తున్న అధికారులు!  |   ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |  

ప్రైవేటు కాలేజీ విద్యార్థులకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం!

ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకాన్ని ఈ ఏడాది ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ తో పాటుగా వసతి, భోజనం ఖర్చుల కోసం ఏడాదికి ర్. 20 వేలు ఇస్తుంది.

కాగా ఈ పథకం ముందుగా ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ప్రవేశపెట్టినా… ఆ తర్వాత ఈ పథకంలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. ఈ పథకాన్ని పీజీ విద్యార్థులతో పాటుగా ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా వర్తింపజేసింది. తాజాగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు షాకిచ్చింది.

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు 2020-2021 సంవత్సరం నుంచి ప్రైవేటు కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు వర్తించదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూనివర్సిటీలు, ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఈ పథకం వర్తింపజేయనున్నారు. కాగా ఏపీ వ్యాప్తంగా 158 ప్రైవేటు కాలేజీలు సెల్ఫ్ ఫైనాన్స్ పద్దతిలో నడుస్తున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతి పక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

Related News