logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

కరోనాపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయ..!

రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల కోవిడ్-19 పరీక్షలు నిర్వహించి రికార్డు సృష్టించిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మొదలైనప్పుడే అప్రమత్తమైన ప్రభుత్వం.. ఎక్కువగా పరీక్షలు నిర్వహిస్తుండటంతోనే అధిక కేసులు బయటపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో బాధితుల ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించడమే కాకుండా సరైన సమయంలో బాధితులకు చికిత్స అందించగలుగుతున్నారు.

తాజాగా ప్రయివేట్ ల్యాబుల్లో కూడా కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించేందుకు ఐసీఎంఆర్ అనుమతులు ఇచ్చింది. అయితే NABL,ICMR గుర్తించిన ల్యాబ్ లకు మాత్రమే ఈ అనుమతి లభించింది. వారు మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహించడానికి ముందుకు రావాలని ప్రభుత్వం సూచంచింది. మార్చి నెలలో ఐసీఎంఆర్ కొన్ని ప్రభుత్వ, ప్రయివేటు ల్యాబులను గుర్తించిన విషయం తెలిసిందే.

అందులో శ్రీ వెంకటేశ్వరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ డైన్స్(తిరుపతి), రంగరాయ మెడికల్ కాలేజీ(కాకినాడ), సిద్దార్థ మెడికల్ కాలేజీ(విజయవాడ), ప్రభుత్వ మెడికల్ కాలేజీ(అనంతపురం), గుంటూరు మెడికల్ కాలేజీల్లో మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహించవచ్చని తెలిపింది. అయితే ప్రయివేటు ల్యాబులకు ఓ కండిషన్ విధించింది. కేవలం రూ. 2900 రూపాయలకు కరోనా పరీక్షలు నిర్వహించే ల్యాబులు మాత్రమే ముందుకు రావాలని తెలిపింది.దీని ద్వారా అడ్డగోలుగా బిల్లు వేసి ప్రజల భయాల్ని క్యాష్ చేసుకునే అవకాశం లేకుండా చేసింది.

Related News