logo

  BREAKING NEWS

ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు  |   బ్రేకింగ్‌: రైతుల కోసం జ‌గ‌న్ మ‌రో అద్భుత‌మైన ప‌థ‌కం  |   సోష‌ల్ మీడియాలో క‌నిపించే ఈ ఆఫ్రిక‌న్ బుడ్డోడి అస‌లు క‌థ ఇది  |   కరోనా రికార్డు.. 24 గంటల్లో 20,903 కేసులు.. 18 వేల మరణాలు!  |   లఢక్ కు చేరుకున్న ప్రధాని మోడీ.. దేనికి సంకేతం?  |   తెలంగాణలో లాక్ డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ..!  |  

ఏపీ ప్రభుత్వం కొత్త పథకం ప్రారంభం… వారి ఖాతాలో రూ. 15 వేలు.. అర్హులు ఎవరంటే?

కరోనా కారణంగా రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులను సైతం లెక్క చేయకుండా ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతుంది. తాజాగా పేద కాపు మహిళలను ఆదుకోవడానికి ఏపీ ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. వైఎస్సార్ కాపు నేస్తం పథకం పేరుతో అర్హులైన ప్రతి కాపు మహిళకు ఆర్థిక భరోసాని అందించేందుకు సిద్ధమైంది.

ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం కాపు మహిళల ఖాతాల్లోకి రూ. 15 వేలు జమ చేయనున్నారు. ఈ విధంగా ఏటా ప్రతి ఒక్కరికి రూ. 75 వేల రూపాయలను అందించనున్నారు. తొలి ఏడాది రూ.354 కోట్ల ఖర్చుతో దాదాపు 2.36లక్షల మంది మహిళలకు లబ్ది చేకూర్చారు. బుధవారం తాడేపల్లి గూడెంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యంమత్రి జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు.

సీఎం జగన్ మాట్లాడుతూ.. 13 నెలల పాలనను ఎలాంటి వివక్ష లేకుండా సాగించామన్నారు. కుల, మత, జాతి భేదం లేకుండా తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. రాష్ట్రంలో కేవలం సంక్షేమ పథకాలకు రూ.4వేల 700 కోట్లు ఖర్చు చేస్తున్నామని జగన్ తెలిపారు.

ఈ పథకం అర్హతల విషయానికొస్తే.. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 సంవత్సరాల మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ. 10 వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ. 12 వేల ఆదాయం కలిగి ఉన్న వారు అర్హులు. కుటుంబానికి 3 ఎకరాల్లోపు మాగాణి/ 10 ఎకరాల్లోపు మెట్ట భూమి లేదా రెండూ కలిపి 10 ఎకరాల్లోపు ఉండాలి

వీరు అనర్హులు:
ఆదాయపు పన్ను చెల్లించేవారు ఈ పథకానికి అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగం కలిగిన కుటుంబాలు, గవర్నమెంట్ పెన్షన్ తీసుకునేవారు కూడా ఈ పథకానికి అనర్హులు. 750 చదరపు అడుగులకు మించిన ఇల్లు, ఆస్తులు, నిర్మాణాలు ఉండరాదు. కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండరాదు (ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు)

Related News