logo

  BREAKING NEWS

బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |  

కీలక మలుపు: నిమ్మగడ్డకు షాకిచ్చిన ఏపీ సర్కార్..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పై వివాదం ముదురుతోంది. తాజాగా ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు అనుకూలించిన నేపథ్యంలో స్థానిక ఎన్నికలు నిర్వహించే విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అడుగులు వేస్తున్నారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తో భేటీ అయ్యి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని నిమ్మగడ్డకు లేఖ రాయడం సంచలనంగా మారింది. రాష్టంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి అనువైన పరిస్థితులు లేవని లేఖలో తెలిపారు. పోలీసులు, అధికారులు కరోనా విధుల్లో ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్లు నిర్వహించడం సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నప్పుడు మీకు తెలియజేస్తామంటూ సీఎం లేఖలో పేర్కొన్నారు.

కాగా పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఉన్నా వారు ఎన్నికలు నిర్వహిస్తున్నారని నిమ్మగడ్డ తన వాదనను వినిపిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలతో ఏపీని పోల్చి చూడటం సరి కాదని, ఈ సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాలకు వైరస్ విస్తరించే ప్రమాదం ఉందని నీలం సాహ్ని లేఖ ద్వారా తెలిపారు.

Related News