logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!

గవర్నర్ ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) ను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో అమరావతి ప్రాంతంలో రైతుల నుంచి భూ సమీకరణ, కౌలు చెల్లింపు, ప్లాట్ల కేటాయింపు, ప్రభుత్వ భవనాల నిర్మాణం తదితర అంశాలకు సంబంధించి 2014 సంవత్సరంలో సీఆర్డీఏను ఏర్పాటు చేసారు.

ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు రాజ ముద్ర పడటంతో రాజధాని వికేంద్రీకరణకు ఏపీ ప్రభుత్వం శరవేగంగా పనులు ప్రారంభిస్తుంది. అందులో భాగంగా సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. దీని ప్రకారం ఇకపై సీఆర్డీఏకు సంబంధించిన లావాదేవీలన్నీ అమరావతి రీజియన్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (ఏఎంఆర్డీఏ) పరిధిలోకి వస్తాయి.

దీనిని నోటిఫై చేస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై 2014 లో ఏర్పాటు చేసిన సీఆర్డీఏ చట్టం ఉనికిలో ఉండబోదని ప్రభుత్వం నోటిఫికేషన్ లో పేర్కొంది. ఏఎంఆర్డీఏ కు పురపాలక శాఖ కార్యదర్శి ఉపాధ్యక్షుడు గా 11 మంది అధికారులు సభ్యులు గా పాలక కమిటీ ఏర్పాటు చేసింది. దీని ప్రకారం.. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, ఏఎంఆర్డీఏ కమిషనర్, గుంటూరు, కృష్ణా జిల్లా కలెక్టర్లు, డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్‌లు సభ్యులుగా నియమితులయ్యారు. ఏఎంఆర్డీఏకు కమిషనర్‌గా లక్ష్మీ నరసింహంను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Related News