logo

జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

పేదలకు లబ్ది చేసే సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న జగన్ ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి శుభవార్త వినిపించారు. కిడ్నీ వ్యాధి బాధితులకు డయాలసిస్‌ ఓ బాధాకర అనుభవం. వారానికి రెండు మూడు రోజులు ఆస్పత్రులకు వెళ్లడం, నాలుగైదు గంటల పాటు డయాలసిస్‌ చేయించుకొని రావడం క్లిష్టమైన ప్రక్రియ. దానికి తోడు ప్రయాణ ఖర్చులు వారికి మరింత భారంగా మారుతున్నాయి.

కిడ్నీ వ్యాధులతో బాధపడే వారికి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతుంది. అందుకోసం వారికి ఉచిత బస్ పాసులను అందించనున్నారు. ఏ నిర్ణయం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది కిడ్నీ వ్యాదిగ్రస్తులకు లబ్ది చేకూరనుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులతో పాటుగా పాక్షికంగా అంధత్వం కలిగిన వారికి కూడా బస్ పాసులను అందించేవిధంగా ప్రభుత్వం యోచిస్తుంది.

ఏ ఒక్క వలస కూలి కూడా రోడ్లమీద నడుచుకుంటూ వెళ్లవద్దని, అలాంటి వారు ఎక్కడ కనిపించినా ఆర్టీసీ బస్సులు తమ రాష్ట్ర సరిహద్దుల వరకు చేర్చాలని ఆదేశించారు. వారికి అవసరమైన ఆహారం, మంచి నీటి సౌకర్యాలను కల్పించాలన్నారు.

Related News