logo

  BREAKING NEWS

గుడ్ న్యూస్‌: క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది..!  |   వైఎస్సార్‌, చంద్ర‌బాబు స్నేహ‌బంధంపై సినిమా  |   క‌రోనా ఖతం అయ్యే డేట్ చెప్పిన బిల్ గేట్స్‌  |   నిజంగానే పాపం త‌గిలిన‌ట్లుంది… క‌రోనాతో ఆ ఎస్సై మృతి  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వల్ల కూడా ఆ ప‌ని కాదు.. కొడాని నాని హాట్ కామెంట్స్‌  |   బ్రేకింగ్‌: మాజీ రాష్ట్ర‌ప‌తికి క‌రోనా పాజిటీవ్‌  |   క‌న్న‌డ దంప‌తుల ధైర్యం… పీఓకేలోని శార‌దాపీఠం నుంచి అయోధ్య‌కు ప‌విత్ర మ‌ట్టి  |   పాక్ నుంచి వ‌చ్చిన ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మ‌హ‌త్య‌  |   విజ‌య‌వాడ కోవిడ్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాలివే..!  |   ప్లాస్మా దానం అంటే ఏమిటి ? ఎవ‌రు చేయాలి ? ఎలా చేయాలి ?  |  

ఇంటర్ విద్యలో కీలక మార్పులకు ఏపీ సర్కార్ ఆదేశాలు!

కరోనా మహమ్మారి కారణంగా 2020 విద్యా సంవత్సరంలో భారీగా మార్పులు వచ్చి చేరాయి. ఎన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో పదో తరగత పరీక్షలను రద్దు చేసారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఒకటి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు లేకుండానే గత పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా పాస్ చేసారు. కాగా అప్పటికే ఏపీలో ఇంటర్ పరీక్షలు పూర్తి కావడంతో గట్టెక్కారు.

అయితే ప్రస్తుతానికి డిగ్రీ, పీజీ పరీక్షలపై సందిగ్దత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ సారి ఇంటర్ విద్యలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మేరకు 2021 క్యాలెండర్ ను రూపొందించారు. ఆగస్టు 3 నుంచి కాలేజీలను ప్రారంభించుకోవచ్చు. ఉదయం సైన్సు గ్రూపులకు, మధ్యాహ్నం ఆర్ట్స్ గ్రూపులకు తరగతులు నిర్వహిస్తారు. కాలేజీలు వారికీ అనుగుణంగా వీటిని మార్చుకోవచ్చు. ఇంటర్ బోర్డు ఆదేశాల ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో 196 పనిదినాలు ఉంటాయి. సీబీఎస్ఈ తరహాలో పాఠ్యాంశాలను 30 శాతం తగ్గించాలని పేర్కొంది.

ఈ సంవత్సరం విద్యా విధానంలో యూనిట్ పరీక్షల విధానాన్ని అమలు చేయాలని ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానం ద్వారా విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తూ… వారి సామర్థ్యాలను నిరంతరం అంచనా వేయగలుగుతారు. ప్రతి సబీజెక్టుకు ఒక వర్క్ బుక్ ను అందిస్తారు. అందులో పోటీ పరీక్షలకు సంసిద్ధమయ్యే విధంగా బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఇక విద్యార్థుల కోసం ఆన్ లైన్ పాఠాల నిమిత్తం వీడియోలను రూపొందించే పనిలో ఉన్నారు. వీరికి మార్చిలోనే యథావిధిగా వార్షిక పరీక్షలను నిర్వహిస్తారు. రెండో శనివారం కూడా కాలేజీలు పని చేయవలసి ఉంటుంది. పండగ సెలవులను రెండు మూడు రోజులకు మాత్రమే కుదించారు.

Related News