logo

  BREAKING NEWS

క‌డుపులో మంట ఎందుకొస్తుంది ? ఎలా త‌గ్గించుకోవాలి ?  |   ఇక మీ గ‌డ‌ప వ‌ద్ద‌కే బ్యాంకు వ‌స్తుంది.. కొత్త స‌ర్వీసు  |   బ్రేకింగ్‌: తెలుగుదేశం పార్టీ పార్ల‌మెంటు అధ్య‌క్షుల నియామ‌కం  |   ఆ ఛాన‌ల్ ప్రోగ్రాంకు రాక‌పోయి ఉంటే ఎస్పీ మ‌న‌తోనే ఉండేవారా..?  |   బీజేపీ జాతీయ క‌మిటీ నియామ‌కం.. న‌లుగురు తెలుగువాళ్ల‌కు చోటు  |   టీడీపీ, వైసీపీ శ్రేణుల‌ను ఉర్రూత‌లూగించిన ఆ రెండు పాట‌లు పాడింది బాలునే  |   సొంతిల్లు దానం.. స‌మాధిపై ఏం రాయాలో ముందే చెప్పిన బాలు  |   శానిటైజ‌ర్ ఎక్కువ‌గా వాడుతున్నారా..? ఈ ప్ర‌మాదాలు ఉన్నాయి జాగ్ర‌త్త‌..!  |   విషాద వార్త‌… ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇక లేరు  |   తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |  

విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం

విశాఖ షిప్ యార్డు ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాధితులకు పరిహారం ప్రకటించింది. షిప్ యార్డు ప్రమాద స్థలాన్ని కొద్ది సేపటి క్రితమే మంత్రి అవంతి శ్రీనివాస్ సందర్శించారు. ప్రమాద ఘటనపై ఆవేదన వ్యక్తం చేసారు. ఇదొక దురదృష్ట ఘటనగా పేర్కొన్నారు. ప్రమాదంలో మరణించిన, క్షతగాత్రులైన కుటుంబాలకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారని అన్నారు.

అనంతరం మీడియా సమావేశం ద్వారా ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా విశాఖ షిప్ యార్డు యాజమాన్యం, యూనియన్ తో చర్చలు జరిపిన ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ప్రకటించినట్టుగా వెల్లడించారు. ప్రమాదం లో మరణించిన ఒక్కో కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినట్టుగా తెలిపారు.

విశాఖ హిందీస్తాన్ షిప్ యార్డు లో ప్రమాదవశాత్తు క్రైన్ కుప్పకూలి ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కాంట్రాక్టు ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో మొత్తం మరణించిన వారి సంఖ్య 11కు చేరుకుంది. మరి కొంత సమయంలో షిఫ్ట్ దిగి ఇంటికి చేరుకోవాల్సిన కార్మికులు మృత్యువాత పడటంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Related News