logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

పదో తరగతి పరీక్షలపై కీలక నిర్ణయం ప్రకటించనున్న ఏపీ సర్కార్

ఏపీలో పదో తరగతి పరీక్షలపై సందిగ్దత కొనసాగుతుంది. రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుంది. ఏపీలో ఒక్క రోజులో 400 కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలా వద్దా అనే దానిపై ఏపీ ప్రభుత్వం పునరాలోచిస్తున్నట్టుగా సమాచారం. ఈ అంశంపై అధికారులు గత రెండు రోజులుగా చర్చలు జరుపుతున్నారు.

అయితే కరోనా నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఏపీలోనూ 11 నుంచి 9 తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.. అయితే పదో తరగతి పరీక్షలు మాత్రం యథావిథిగా కొనసాగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు కూడా.

కాగా షెడ్యూలు ప్రకారం జులై 10 వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరపవలసి ఉంది. అందులో భాగంగా ఇప్పటివరకు 11 పేపర్ల పరీక్షలను 6 పేపర్లకు కుదించింది బోర్డు. తాజా పరిస్థితుల దృష్ట్యా ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తారా లేక యథావిథిగా కొనసాగిస్తారా అనే సందేహం నెలకొంది. కాగా నేడో రేపో ప్రభుత్వం పదో పరీక్షలపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.

Related News