logo

  BREAKING NEWS

ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |   ద‌సరా పండుగ రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారో తెలుసా ?  |  

మాట్రిమోనీ సైట్లలో పెళ్లి సంబంధం వెతుకుతున్నారా? ఈవార్త మీకోసమే..

మెట్రోమోని సైట్లలో పెళ్లికాని యువకులే టార్గెట్ గా మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా ఓ నిత్య పెళ్లి కూతురుని ఏపీ పోలీసు అరెస్ట్ చేసారు. పెళ్లి పేరుతో ఈ యువతి సాగించిన ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. యువకులను పెళ్లిళ్ల పేరుతో మోసం చేసి వారి దగ్గర నుంచి లక్షలు కాజేయడం ఆ తర్వాత గృహహింస కేసుల పేరుతో బెదిరించి డబ్బు గుంజడం చేసేది. గత నెలలో వెలుగు చూసిన ఈ కేసు సంచలనం సృష్టించింది. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఈ కేసులో ఆమె గురించి వెల్లడైన విషయాలు చూసి పోలీసులే ఖంగుతిన్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ కిలాడీ వలలో మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన బాధితులు ఉన్నారు.

చిత్తూరు జిల్లా తిరుపతి కి చెందిన స్వప్న అలియాస్ హరిణి చౌదరి అని ఇలా వివిధ పేర్లతో పెళ్లి కోసం మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో పేరు రిజిష్టర్ చేసుకుంది. ప్రకాశం జిల్లా వీరేపల్లికి చెందిన విప్పర్ల రామాంజనేయులు ఆమె వివరాలు నచ్చడంతో 2019 లో ఆమెను వివాహం చేసుకున్నాడు. రామాంజనేయులు డెన్మార్క్ లో పని చేస్తుంటాడు. తాను ఢిల్లీలో ఐపీఎస్ స్దాయి అధికారినని, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దగ్గర పని చేస్తుంటానని రామాంజనేయులునమ్మించింది. పెళ్లైన నెల రోజులకే తన భార్య మ్యాట్రిమోని వెబ్ సైట్ లో ఉంచిన వివరాలేవీ నిజం కాదనే విషయాన్ని తెలుసుకున్నాడు.

దీంతో ఆమెను ఇక్కడే వదిలేసి మళ్ళీ డెన్మార్క్ వెళ్ళిపోయాడు. స్వప్న ఈ విషయంపై దొనకొండ పోలీసులను ఆశ్రయించింది. తన భర్త తనను మోసం చేసాడని కేసు పెట్టింది. రామాంజనేయులు కూడా ఈ యువతిపై తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ కేసులో విచారణ జరుపగా ఈ యువతే చాలా మందిని మోసం చేసిన విషయం తెలిసింది. తిరుపతిలో హాస్టల్ లో ఉండి ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ఉండే స్వప్నకు మొదట మేనమావతో వివాహం జరిగింది. కోద్దిరోజులకు అతడ్ని వదిలేసి తనకెవరూ లేరని తాను అనాధనని చెప్పి తిరుపతికి చెందిన పృధ్వీరాజ్ ను పెళ్లి చేసుకుంది.

కొన్నాళ్లకు అతడితో గొడవపడి అతడిపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి రూ. 25 లక్షలు డిమాండ్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ మాట్రిమోనీ సైటుని నమ్ముకుంది. ఈసారి జర్మనీలో ఉద్యోగం చేసే ఆత్మకూరుకు చెందిన సుధాకర్ అనే యువకుడికి వల విసిరింది. పెళ్ళికి ముందే అతనిదగ్గర రూ. 5 లక్షలు కాజేసింది. ఈ విషయంపై నిలదీయడంతో కేసు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడింది. తిరుపతిలో వేదాభ్యాసం చేసే వ్యక్తి కూడా ఈమె బాధితుడే. ఈమెపై పోలీసులు కేసు నమోదు చేసి గతంలో రిమాండుకు తరలించారు. తాజాగా పూర్తి ఆధారాలతో అరెస్టు చేసారు. ఇకనైనా మాట్రిమోనీ సంబంధాలు చూసుకునే వారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Related News