logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ప్ర‌త్యేక హోదాపై మ‌ళ్లీ నోరెత్తిన సీఎం జ‌గ‌న్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా విష‌యంలో ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా కాలం త‌ర్వాత నోరెత్తారు. ఇవాళ ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డుల‌కు సంబంధించి మ‌న పాల‌న – మీ సూచ‌న కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌చ్చి ఉంటే పారిశ్రామిక రాయితీలు వ‌చ్చి ఉండేవ‌న్నారు. ప్ర‌‌త్యేక హోదా నేడు కాక‌పోయినా రేప‌యినా వ‌స్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. అప్ప‌టివ‌ర‌కు తాము ప్ర‌త్యేక హోదా అడుగుతూనే ఉంటామ‌న్నారు. కేంద్రంలో ప్ర‌భుత్వ ఏర్పాటుకు త‌మ మ‌ద్ద‌తు అవ‌స‌ర‌మైన‌ప్పుడు క‌చ్చితంగా ప్ర‌త్యేక హోదా ఇస్తేనే మ‌ద్ద‌తు ఇస్తామ‌ని చెబుతామ‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.

ప్ర‌త్యేక హోదా లేక‌పోయినా రాష్ట్ర ప్ర‌భుత్వం పారిశ్రామిక ప్ర‌గ‌తి చేయాల్సినంత చేస్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. గ‌త పాల‌కుల‌లాగా తాను 20 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు, 40 ల‌క్ష‌ల ఉద్యోగాలు సాధించామ‌ని చెప్ప‌లేన‌ని అన్నారు. ఎయిర్ బ‌స్‌, బుల్లెట్ ట్రైన్‌, హైప‌ర్‌లూప్ వ‌స్తున్నాయ‌ని అంటూ అబ‌ద్ధాలు చెప్ప‌లేన‌ని పేర్కొన్నారు. పెట్టుబ‌డిదారుల‌కు తాను ఒకే ఒక మాట ఇస్తున్నాన‌ని.. తాము ఏదైతే మాట్లాడ‌తామో అది క‌చ్చితంగా నెర‌వేరుస్తామ‌ని అన్నారు. పెట్టుబ‌డిదారుల‌కు వేదింపులు ఉండ‌వ‌న్నారు.

మౌలిక స‌దుపాయాల ప‌రంగా ఏపీకి చాలా బ‌లాలు ఉన్నాయ‌న్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత సుస్థిర ప్ర‌భుత్వం త‌మ రాష్ట్రంలో ఉంద‌న్నారు. రాష్ట్రానికి 972 కిలోమీట‌ర్ల విశాల స‌ముద్ర‌తీరం, విస్తార‌మైన రైలు, రోడ్ క‌నెక్టివిటీ ఉంద‌ని పేర్కొన్నారు. నాలుగు పోర్టులు, 6 ఎయిర్‌పోర్టులు ఉన్నాయ‌ని చెప్పారు. అవినీతికి తావు లేకుండా పెట్టుబ‌డిదారుల‌కు త‌మ ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు ఇస్తుంద‌న్నారు.

Related News