logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

కడప స్టీల్ ప్లాంట్ పై జగన్ సమీక్ష.. రూ. 500 కోట్ల కేటాయింపు!

కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం రూ. 500 కోట్ల ఈక్విటీ ని ప్రకటించారు. ఈ సమావేశంలో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ తో భాగస్వామ్యం కోసం ఆసక్తి చూపుతున్న హ్యుండాయ్, టాటా స్టీల్స్, ఎస్సార్‌ స్టీల్‌ సహా పలు కంపెనీల చర్చలకు సంబందించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేసారు.

ప్రతిపాదనలు చేసిన కంపెనీలతో చర్చలు జరపాలని సీఎం అధికారులను ఆదేశించారు. రానున్న రెండు నెలల్లోగా ఈ భాగస్వామ్య ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. మరో రెండు సంవత్సరాల్లో టౌన్ షిప్, అనుబంధ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకునే విధంగా ముందుకు సాగాలన్నారు. ఈ నెలాఖరులోగా సాయిల్ టెస్టింగ్, జియో టెక్నీకల్ సర్వే పూర్తి చేస్తామని అధికారులు వివాయించారు.

ఫ్యాక్టరీ నిర్మాణానికి అవసరమైన రోడ్లు, కాంపౌండ్ వాల్, విద్యుత్ సరఫరా, నిర్మాణాల పనుల కోసం కరెంటుతో పాటు నీటి సదుపాయాలకు కూడా అవసరమైన పనులను పూర్తి చేయాలనీ జగన్ అధికారులను పురమాయించారు.

Related News