logo

  BREAKING NEWS

ఫలించిన ‘శ్వేత రాయబారం’.. మనసు మార్చుకున్న బుద్ధా!  |   హిందూపురంలో సీన్ రిపీట్.. అభిమానికి విశ్వరూపం చూపించిన బాలయ్య!  |   నా అనుచరుడు ఒక్కడు చాలు.. నీ పని ఖతం: టీడీపీలో బుద్ధా వర్సెస్ కేశినేని  |   అవును అప్పులు చేసాం.. ఆ విషయం గర్వంగా చెప్తాం : మంత్రి బుగ్గన  |   షాకింగ్ సర్వే.. హైదరాబాద్ లో ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా!  |   అసెంబ్లీ ఎన్నికల ముందు కేరళ సీఎంకు షాక్.. విజయన్ మెడకు మళ్ళీ అదే కేసు!  |   హై కోర్టుకు ఎన్నికల సంఘం క్షమాపణలు.. ఎందుకంటే?  |   ఇదేనా దోస్తానా..? ఏపీలో అడుగుపెడుతున్న ఎంఐఎం  |   మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |  

దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితా.. టాప్ లో వైఎస్ జగన్!

దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి టాప్ లో నిలిచారు. ఇటీవల జాతీయ మీడియా అయిన ఏబీఎన్ వార్తా ఛానెల్ వారు ‘దేశ్ కా మూడ్’ పేరుతో ఓ సర్వేను చేపట్టారు. ఈ సర్వేలో భాగంగా బెస్ట్ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు.

అన్ని దేశాల ముఖ్యమంతులపై చేపట్టిన ఈ సర్వేలో 543 లోక్ సభ స్థానాలలో గత 12 వారాల్లో 30 వేలకు పైగా ప్రజలను వివిధ ప్రశ్నలను అడిగారు. వారిచ్చిన సమాధానాల ఆధారంగా ఈ సర్వేను రూపొందించారు. కాగా ఈ లిస్టులో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నంబర్ వన్ స్థానంలో నిలవగా ఆ ఆతర్వాతి స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండవ స్థానంలో నిలిచారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా అత్యుత్తమ పాలనా సామర్థ్యంతో అన్ని వర్గాల ప్రజలకు ఆసరాగా నిలిచే విధంగా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న వైఎస్ జగన్ ఈ ఘనత సాధించారు.

వైఎస్ జగన్ తర్వాతి స్థానంలో వరుసగా కేరళ సీఎం పినారయి విజయన్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే లు నిలిచారు. 6వ స్థానంలో ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ , 7వ స్థానంలో మమతా బెనర్జీ, 8వ స్థానంలో మధ్యప్రదేశ్ సీఎం శివ రాజ్ సింగ్ చౌహాన్, 9వ స్థానంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్, 10 వ స్థానంలో గుజరాత్ సీఎం విజయ్ రూపాన్ని ఉన్నారు.

సర్వేలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పై కూడా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో కేంద్రం పని తీరుతో 66 శాతం మంది ప్రజలు సంతృప్తికరంగా ఉన్నట్టుగా వెల్లడించారు. 30 శాతం మంది ప్రజలు మోదీ పాలనపై అసంతృప్తిగా ఉన్నట్టుగా వెల్లడించారు. నాలుగు శతం మంది ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 58 శాతం మంది ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా నిలవగా.. మరో 28 శాతం మంది మాత్రం యూపీఏ గెలుస్తుందని సమాధానం ఇచ్చారు.

ప్రధాని పదవి కోసం 55 శాతం మంది ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఎంచుకున్నారు. రాహుల్ ను ప్రధానిగా 11 శాతం మంది ఎంచుకున్నారు. బెంగాల్ సీఎం మమతను ప్రధాని పదవి కోసం 1 శాతం మంది కోరగా కేజ్రీవాల్ ను 5 శాతం మంది కోరారు. ప్రియాంక గాంధీని 1 శాతం మంది ఎంచుకోగా ఇతర నేతలకు 12 శాతం మంది మద్దతు తెలిపారు.

Related News