logo

  BREAKING NEWS

ఢిల్లీకి సీఎం జగన్.. అమిత్ షాతో భేటీ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. సుదీర్ఘ లాక్ డౌన్ తరువాత జగన్ మొదటిసారిగా ఢిల్లీ పెద్దలను కలవనున్నారు. ఇటీవల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో ఫోన్లో చర్చించిన జగన్ రేపు అమిత్ షాను నేరుగా కలిసి ఏపీకి సంబందించిన పలు కీలక అంశాలపై చర్చలు జరపనున్నట్టుగా సమాచారం.

లాక్ డౌన్ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్రానికి కేంద్రానికి వివరించి రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక వెసులుబాటు కోరనున్నారు. అదేవిధంగా కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న వ్యవహారాలపై కూడా సంప్రదింపులు జరపనున్నారు. కృష్ణా నది మిగులు జలాలను వినియోగించుకునే ప్రక్రియలో భాగంగా చేపడుతున్న పోతి రెడ్డి పాడు విస్తరణ పథకానికి తెలంగాణ సర్కారుకు ఉన్న అభ్యంతరాలను కూడా అమిత్ షా ముందుంచనున్నారు జగన్.

అదే విధంగా ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి అంశం, మండలి రద్దు, ఎస్ ఈసీ వ్యవహారంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో బడ్జెట్ సమావేశాల సమయంలో మండలి రద్దు బిల్లు పార్లిమెంట్ ముందుకు రాలేదు. త్వరలో మరోసారి పార్లిమెంట్ సమవేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడేలా చూడాలని కేంద్రాన్ని కోరనున్నట్టు సమాచారం.

Related News