logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

విమెన్స్ డే: ఏపీ మహిళలకు సీఎం జగన్ శుభవార్త!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లి గూడెంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన కేక్ కట్ చేసి వేఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పాదయాత్ర సమయంలో మహిళల కష్టాలను కళ్లారా చూశానన్నారు. వారి కష్టానికి, సేవలకు ఆర్ధిక కొలమానాలు లేవన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకెళ్లాలని జగన్ ఆకాంక్షించారు.

మనమంతా వారికి నిజంగానే సగభాగం ఇస్తున్నామా లేదా అనే విషయం ఆలోచించుకోవాలన్నారు. కాగా మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ మహిళలు సీఎం శుభవార్త వినిపించారు. ఈ రోజున ఫోన్లను కొనే మహిళలందరికీ 10 శాతం రాయితీని ప్రకటించారు. అయితే ఈ బెనిఫిట్స్ పొందాలనుకునే వారు కచ్చితంగా దిశా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపారు. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన దిశా యాప్ పై అవగాహన కల్పించేందుకే ఈ ప్రయత్నం అని తెలిపారు.

తమ ప్రభుత్వం మహిళల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఈ స్సందర్భంగా జగన్ గుర్తుచేశారు. అమ్మ ఒడి పథకం ద్వారా రూ. 13,022 కోట్లను ఖర్చు చేస్తున్నాం. సంపూర్ణ పోషణ ఇవ్వడంతో పాటుగా 50 శాతం రిజర్వేషన్లను కల్పించామన్నారు. అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, ఆసరా పథకాలను రూపొందించాం. దిశా చట్టం ద్వారా సత్వర న్యాయం జరిగేలా కోర్టులను ఏర్పాటు చేసాం.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏపీ మహిళా ఉద్యోగులకు శుభవార్త వినిపించారు. వారికి ప్రత్యేక సాధారణ సెలవులను ప్రకటించారు. ఇప్పటి వరకు ఏపీలో మహిళా ఉద్యోగినులకు 15 ప్రత్యేక సెలవు దినాలు ఉండగా వాటిని 20 రోజులకు పొడిగించారు. త్వరలోనే అందుకు సంబందించిన జీవోను జారీ చేయనుంది ప్రభుత్వం.

Related News