logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

రెండు రాష్ట్రాల వారికీ వర్తింపజేయండి.. సీఎం జగన్ ఆదేశాలు!

కృష్ణా జిల్లా వేదాద్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు.

ఏపీ భూభాగంలోనే ప్రమాదం సంభవించిన కారణంగా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వాసులను కూడా మానవతా దృక్పథంతో ఆదుకోవాలని అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలకు అందిస్తున్న 5 లక్షల ఎక్స్ గ్రేషియాను తెలంగాణ వాసులకు కూడా వర్తింపజేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

వేదాద్రి ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఆంధ్రా వాసులకు కూడా దీనిని వర్తింపజేయాలని కేసీఆర్ వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఆదేశించారు.

కాగా కృష్ణా జిల్లా వేదాద్రి వద్ద జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో ఖమ్మం, కృష్ణా జిల్లాలకు చెందిన 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 9 మంది ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం, జమలాపురం గ్రామాలకు చెందిన వారు కాగా ముగ్గురు కృష్ణ జిల్లా జయంతి గ్రామానికి చెందిన వారు ఉన్నారు. వేదాద్రి శ్రీయోగానంద లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.

Related News