logo

  BREAKING NEWS

ఢిల్లీ రైతుల ఆందోళనపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!  |   రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |  

ఏపీ క్యాబినెట్ భేటీ: కీలక అంశాలపై చర్చ!

ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో పలు కీలకాంశాలపై చర్చ జరగనున్నట్టుగా సమాచారం. ఇటీవల ఎస్సి, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా చేయాలన్నదే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగన్నన్న వైఎస్సార్ బడుగు వికాస పథకానికి ఈ సమావేశంలో ఆమోద ముద్ర పడనుంది.

అదే విధంగా నూతన ఇసుక విధానంపై మంత్రుల కమిటీ చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే మచిలీపట్టణం డీపీఆర్ పై చర్చ జరగవలసి ఉంది. శాసన సభా సమావేశాల నిర్వహణ తేదీపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు నవంబర్ 3వ వారం నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది.

రాష్ట్రంలో సంభవించిన భారీ వర్షాల కారణంగా ఇప్పటికే 10 వేల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసింది ప్రభుత్వం. ఈరోజు సమావేశంలో క్యాబినెట్ ముందుకు ఈ అంశం కూడా రానుంది. దిశ బిల్లులో సవరణలు, అసైన్డ్ భూముల లీజుల బిల్లులపై క్యాబినెట్ చర్చించనుంది.

Related News