logo

  BREAKING NEWS

మే 15 లోపు వాట్సాప్ ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయకుంటే ఏమవుతుంది?  |   జ‌గ‌న్ – ష‌ర్మిల మ‌ధ్య విభేదాలు 100 % నిజం.. ఇదే సాక్ష్యం  |   శ‌త్రువులు కూడా ఈ విష‌యంలో జ‌గ‌న్‌ను శ‌భాష్ అంటారు  |   కరోనాను అడ్డుకునే అస్త్రం అదొక్కటే.. శుభవార్త చెప్పిన శాస్త్రవేత్తలు  |   శుభవార్త: తగ్గిన బంగారం ధరలు 16.04.2021 బంగారం, వెండి ధరలు  |   కరోనా తీవ్ర ఇన్ఫెక్షన్ వీరిలోనే ఎక్కువ.. కారణం ఇదే  |   పెరిగిన బంగారం ధరలు 15.04.2021 బంగారం, వెండి ధరలు  |   బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |  

రూ. 2,24,789.18 కోట్లుతో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఏపీ ప్రభుత్వం..!

2020-21 సంవత్సరానికి గాను రెండో దఫా ఆర్థిక బడ్జెట్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్, మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా 2,24,789.18 కోట్ల అంచనా వ్యయం, 44,396 కోట్ల మూలధన వ్యయం,1,80,392 కోట్ల రెవెన్యూ వ్యయంతో బడ్జెట్ ను రూపొందించినట్టుగా బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేసారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలను అమలు చేసి తీరుతామన్నారు. కరోనా సంక్షోభంలోనూ ఆర్థిక వ్యవస్థను కుంటుపడకుండా చూశామని తెలిపారు.

వివిధ రంగాల వారీగా బడ్జెట్ ను కేటాయింపులు ..
వ్యవసాయ రంగానికి రూ. 11,891 కోట్లు
ఆరోగ్య రంగానికి రూ.11,419.44 కోట్లు
పశుగణాభివృద్ది, మత్స్య రంగానికి రూ.1279.78 కోట్లు
గృహ నిర్మాణ రంగానికి రూ.3,691.79 కోట్లు
హోంశాఖ కు రూ.5,988.72 కోట్లు
జలవనరుల శాఖకు రూ. 11,805.74 కోట్లు
పెట్టుబడులు, మౌలిక వసతుల రంగానికి రూ.696.62 కోట్లు
ఐటీ రంగానికి రూ. 197.37 కోట్లు
కార్మిక సంక్షేమానికి రూ. 601.37 కోట్లు
పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్ కు రూ. 16710.34 కోట్లు
న్యాయశాఖకు రూ. 913.76 కోట్లు
మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలకు రూ. 8150.24 కోట్లు
స్కిల్ డెవలప్ మెంట్ కు రూ. 856.64 కోట్లు
పౌర సరఫరాల శాఖకు రూ. 3,520.85 కోట్లు
ఆర్థిక రంగానికి రూ. 50,703 కోట్లు
విద్యుత్ రంగానికి రూ. 6,984.72 కోట్లు
ప్రాథమిక ఉన్నత విద్యకు రూ. 22,604.01 కోట్లు
సోషల్ వెల్ఫేర్‌ కోసం రూ.12,465.85 కోట్లు
ట్రాన్స్ పోర్ట్, ఆర్‌అండ్‌బీ కోసం రూ.6,588.58 కోట్లు
మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం రూ.3456.02 కోట్లు

సవరించిన అంచనాలు 2019-20
సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయం రూ. 1,37,518.07 కోట్లు
మూలధన వ్యయం రూ. 12,845.49 కోట్లు
రెవెన్యూ లోటు దాదాపుగా రూ. 26,646.92 కోట్లు
ఆర్థిక లోటు దాదాపుగా 40,493.46 కోట్లు
ఇవి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 2.47 శాతం, 3.75 శాతం​

వివిధ పథకాలకు కేటాయింపులు
గ్రామ,వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థకు రూ.46.46 కోట్లు
రియల్‌ టైం గనర్నెన్స్‌ కోసం రూ.54.51 కోట్లు
వ్యవసాయ ల్యాబ్‌లకు రూ.65 కోట్లు
వైఎస్‌ఆర్‌ రైతుభరోసా – పీఎం కిసాన్‌కు రూ.3,615.60 కోట్లు
డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలో ఉన్నత విద్యకు రూ.2,277 కోట్లు
అత్యవసర సర్వీసులైన 104, 108 లకు రూ.470.29 కోట్లు
డాక్టర్‌ వైఎస్సార్‌‌ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు
వడ్డీలేని రుణాల కోసం రూ.1100 కోట్లు కేటాయించారు.

Related News