logo

  BREAKING NEWS

‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |   ‘గుంటూరు’కు చెందిన కోహినూర్ వజ్రం బ్రిటన్ చేతికి ఎలా వెళ్ళింది?  |   బ్రేకింగ్: పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. జ‌గ‌న్‌కు భారీ షాక్‌  |   వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |  

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అరెస్ట్!

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అరెస్టు చేసారు. గత నాలుగు రోజులుగా రామతీర్థంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. రామతీర్థం ఆలయంలోని రాముడి విగ్రహం ధ్వంసం ఘటన నేపథ్యంలో ఈరోజు బీజేపీ- జనసేన నేతలు చలో రామతీర్థంకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు వీరిని అడ్డుకున్నారు. సెక్షన్ 30 అమలులో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు, ఆందోళనలకు నౌమతులు లేవని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు బీజేపీ నేతలకు మధ్యన వాగ్వాదం నెలకొంది.

నెల్లి మరల జంక్షన్లో బారికేడ్లు దాటి లోపలి వెళ్లేందుకు ప్రయత్నించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. రామతీర్థానికి ఎలాగైనా వెళ్ళితీరతామంటూ సోము వీర్రాజు వాదనలకు దిగడంతో పోలీసులు సోము వీర్రాజుతో సహా బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసారు. ప్రస్తతం వీరందరిని పోలీస్ స్టేషనుకు తరలిస్తున్న క్రమంలో పోలీసులు బీజేపీ కార్యకర్తలకు మధ్యన తోపులాట జరిగింది. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Related News