logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

మూడు రాజధానుల బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం..!

మూడు రాజధానుల బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాజధానిని మూడు ప్రాంతాలకు విస్తరిస్తూ సీఎం జగన్‌ గతంలోనే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు ప్రకారం పాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనుంది. మూడు రాజధానుల ప్రతిపాదనకు గతంలోనే అసెంబ్లీలో ఆమోదం లభించినా మండలిలో ఈ బిల్లు పెండింగ్ లో ఉంది.

ఈరోజు ఉదయం మూడు రాజధానుల అంశం పై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ బిస్వాబ్యూషన్ హరిచందన ప్రసంగించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బిల్లును మరోసారి అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం. దీంతో అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గత అసెంబ్లీ సమావేశంలోనే సభ్యులంతా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు.

కాబట్టి ఇప్పుడు ఎలాంటి చర్చ లేకుండానే మరోసారి బిల్లు ఆమోదం పొందింది. వీటితోపాటు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును సైతం అసెంబ్లీ ఆమోదించింది. స్థానిక సంస్థల ఎన్నికల సంస్కరణల బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లు, వ్యాట్ సవరణ బిల్లు, 2020 ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌కు శాసనసభ ఆమోదం తెలిపింది.

Related News