logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

40 ఏళ్ల బ్యూటీతో 25 ఏళ్ల హీరో ప్రేమకథ?

‘జాతిరత్నాలు’ సినిమాతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఇటీవల విడుదలైన ఈ సినిమా థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. మూస ఫార్ములాల జోలికి పోకుండా మొదటి నుంచీ కథల ఎంపికలో తనదైన మార్క్ చూపిస్తూ వస్తున్నాడు నవీన్. నటుడిగానే కాకుండా స్టాండ్ అప్ కమెడియన్ గా, రైటర్ గా కూడా సత్తా చాటాడు. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా పైనే అందరి దృష్టి ఉంది.

ఈ నేపథ్యంలో నవీన్ కు ఓ బంపర్ ఆఫర్ తగిలినట్టు తెలుస్తుంది. హీరోగా రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉన్న ఈ హీరో కు ఏకంగా అనుష్కతో తో రొమాన్స్ చేసే అవకాశం వచ్చిందట. మహేష్ అనే యువ దర్శకుడు తయారు చేసిన కథలో అనుష్క – నవీన్ పోలిశెట్టిలు కలిసి నటించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. గతంలో ఈ దర్శకుడు సందీప్ కిషన్ తో ‘రారా కృష్ణయ్య’ అనే సినిమా తీసాడు.

మళ్ళీ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ తో కథను తయారు చేసుకున్నాడట. తనకన్నా వయసులో 15 ఏళ్ల పెద్దమ్మాయితో ప్రేమలో పడే యువకుడి పాత్రలో నవీన్ కనిపిస్తుండగా.. 40 ఏళ్ల మధ్య వయసు యువతిగా అనుష్క పాత్ర ఉండబోతుందట. తన ప్రేమను ఆ అమ్మాయికి చెప్పడం.. సమాజాన్ని ఒప్పించడం ఇలా చాలా పెద్ద కథే ఉందట ఈ సినిమా వెనుక.

ఈ సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అయితే ‘నిశ్శబ్దం’ సినిమా డిజాస్టర్ తర్వాత అనుష్కకు చెప్పుకోదగ్గ హిట్టు లేదు. ప్రస్తుతం ఏ సినిమాకు సైన్ చేయలేదు. అయితే దర్శకుడు మహేష్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో ఈ సినిమాకు వెంటనే ఒకే చెప్పేసిందట స్వీటీ. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక సమాచారం రానుంది.

Related News